మెదక్ జిల్లా కేంద్రంలో వైన్స్ షాపులు తెరుచుకున్నాయి. మందుబాబులు ఆనందంతో చిందులేశారు. ఉదయం పది గంటల నుంచే మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిక్కిరిసిపోయారు. ఎండను సైతం లెక్కచేయకుండా అర కిలోమీటరు పొడవున క్యూలో నిల్చున్నారు.
తెరుచుకున్న వైన్స్.. బారులు తీరిన మందు ప్రియులు - మెదక్‌లో తెరుచుకున్న మద్యం దుకాణాలు
మద్యం దుకాణాలు తెరవడానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల మెదక్ జిల్లాలోని మద్యం షాపు ముందు మద్యం ప్రియలు బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే దుకాణాలు వద్ద నిరీక్షించారు.
తెరుచుకున్న వైన్స్... బారులు తీరిన మందు ప్రియులు
అధికారులు ప్రతి ఒక్కరికి టోకెన్లు ఇవ్వడం వల్ల మద్యం షాపు వద్ద ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మద్యం విక్రయిస్తున్నారు. మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:గ్రామాలు, మండల కేంద్రాల్లో అన్ని దుకాణాలకు అనుమతి