మెదక్ జిల్లా నర్సాపూర్‌ను రాబోయే రోజుల్లో ప్లాస్టిక్‌రహిత పట్టణంగా మార్చుతామని పురపాలక కమిషనర్ అశ్రిత్‌కుమార్ తెలిపారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున చెత్త వాహనాలను మున్సిపల్ ఛైర్మన్ మురళియాదవ్, కౌన్సిలర్ల ఇళ్లవద్దకు పంపారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసి వీధుల్లోకి వచ్చే వాహనంలో వేయాలని సూచించారు.
నర్సాపూర్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చుతాం : పురపాలక కమిషనర్
చెత్త సేకరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదర్శంగా నిలవాలని మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక కమిషనర్ అశ్రిత్‌కుమార్ అన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా చేసి వాహనాల్లో వేయాలన్నారు. కొత్త ఏడాది రోజే దగ్గరుండి ఇళ్లవద్దకు వాహనాలను పంపించారు.
నర్సాపూర్ పురపాలిక కమిషనర్
ప్రజాప్రతినిధులతో ముందుగానే చెత్తను వేయించే కార్యక్రమం చేపట్టారు. నర్సాపూర్ పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ కవర్లలో వేసి వీధుల్లో పడవేయవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.