మెదక్‌లోని శ్రీసాయి బాలాజీ గార్డెన్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో వ్యాపారస్థులకు తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలో చెత్త సేకరణ నిర్వహణ సరిగా జరగడం లేదంటూ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని ఎంత చెప్పినా.. ఎందుకు పాటించడం లేదంటూ వారిని ప్రశ్నించారు. వ్యాపారస్థులు బాధ్యతతో వ్యవహరించి తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛ మెదక్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
స్వచ్ఛ మెదక్‌లో భాగస్వాములు కావాలి: ధర్మారెడ్డి - మెదక్
మెదక్‌లోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో వ్యాపారస్థులకు తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి పాల్గొన్నారు.
స్వచ్ఛ మెదక్‌లో భాగస్వాములు కావాలి: ధర్మారెడ్డి