మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఎన్నికల్లో 15 వేల మంది సిబ్బంది పాల్గోనున్నారని పేర్కొన్నారు. విధుల్లో పాల్గొనే వారికి శిక్షణ పూర్తైందని స్పష్టం చేశారు. 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నందున మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.
ఓటర్ స్లిప్పు, ప్రభుత్వ గుర్తింపు పత్రం తప్పనిసరి - VIDEO GRAPHY
పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారందరికీ పూర్తి స్థాయి శిక్షణ పూర్తి చేశారు.
ఓటేయాలంటే ఓటర్ స్లిప్పుతో పాటు ప్రభుత్వ గుర్తింపు పత్రం తప్పనిసరి
ఓటర్ స్లిప్పుతో పాటు ప్రతి ఓటరు తప్పకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ప్రతి అభ్యర్థి విధిగా ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలని సూచించారు. అబ్జర్వర్ సమావేశంలో ఖర్చుల వివరాలు ఇవ్వని నలుగురు అభ్యర్థులకు షోకాజ్ నోటీసు ఇచ్చామని తెలిపారు.
ఇవీ చూడండి :విజయశాంతిపై హనుమంతరావు గరంగరం