ఓటే ప్రజల వజ్రాయుధమని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎల్లంకి కళాశాల ప్రధానోపాధ్యాయులు వావిలాల అశోక్ అన్నారు. ఈనాడు, ఈటీవీభారత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎల్లంకి కళాశాలలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
![ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు voter awareness program by etv bharat eenadu in narsapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5753672-thumbnail-3x2-voter.jpg)
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు
ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వక్తలు సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకుని.. మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు.
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'