తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధి కోసమే మరోసారి గెలిపించండి' - TRS CANDIDATE KOTHA PRABHAKAR REDDY

తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని రామచంద్రాపురంలో బీహెచ్​ఈల్ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం మరోసారి గెలిపించండి : కొత్త ప్రభాకర్​

By

Published : Apr 1, 2019, 1:02 PM IST

రామచంద్రాపురంలో బీహెచ్​ఈల్ ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
మెదక్​ జిల్లా రామచంద్రాపురంలోని అంబేడ్కర్ స్టేడియంలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉదయం పూట నడకకు వచ్చిన బీహెచ్​ఈల్ ఉద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తున్న తనను గెలిపించి పార్టీ అధినేతకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కొనసాగించేందుకు మరోసారి తనను లోక్ సభకు పంపాల్సిన అవసరం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details