మెదక్ జిల్లా హవేలీ ఘణపురం మండలం తొగుట గ్రామంలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సతీమణి మంజుల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు మంగళహారతులతో ఆమెకు స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఎన్నికల్లో పద్మాదేవేందర్ రెడ్డిని ఆదరించినట్లుగానే లోక్సభ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
'మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్రెడ్డినే గెలిపించండి' - KOTHA PRABHAKAR REDDY
అభ్యర్థుల తరఫున వారి సతీమణులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. మెదక్ తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య కొత్త మంజుల నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కర పత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు.
!['మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్రెడ్డినే గెలిపించండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2898993-367-7b59eefe-b705-48c0-897a-322e6a555eba.jpg)
కర పత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న కొత్త మంజుల