రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని తెలంగాణ కోసం కొట్లాడిన వారికి... ఉద్యమకారులకు ప్రభుత్వంలో విలువ లేదని మాజీ ఎంపీ, భాజపా నాయకుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పితే అబద్ధాలని.. రాష్ట్రాన్ని అప్పుల్లో పడేశారని ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులను కడుతున్నారని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శరవేగంగా ముందకు దూసుకెళ్తోందని ప్రశంసించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో భాజపా జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పితే అబద్ధాలే: మాజీ ఎంపీ వివేక్ - kcr
ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పితే అబద్ధాలేనని ఘాటు విమర్శలు చేశారు మాజీ ఎంపీ, భాజపా నాయకుడు వివేక్. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
వివేక్