పెద్దచింతకుంటలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు - vishwakarma jayanti news
విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటలో ఉత్సవాలు చేశారు. గ్రామంలోని బ్రహ్మంగారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

vishwakarma jayanti celebrations in pedda chinthakunta
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంటలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో జయంతి వేడుకలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు నర్సాపూర్ పురపాలక ఛైర్మన్ మురళీయాదవ్, కౌన్సిలర్ అశోక్ గౌడ్, కృపాచారి, షణ్ముఖచారి, సదానందం తదితరులు హాజరయ్యారు.