మెదక్ జిల్లా నర్సాపూర్లోని పేద విద్యార్థులకు విష్ణు విద్యాసంస్థల ఛైర్మన్ విష్ణురాజు ట్యాబ్స్, డాంగిల్ పంచారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, సాంకేతికత సహాయంతో విద్యలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతులు వినడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం తన వంతుగా విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి వారికి ట్యాబ్స్, డాంగిల్ పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. చదువు ఎవరికి సొంతం కాదని.. ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆకాశమే హద్దుగా ఎదగాలనే తపన విద్యార్థులకు ఉండాలని సూచించారు. ఫార్మారంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని విష్ణు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ సూచించారు. రాబోయే రోజుల్లో ఫార్మారంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రతీ ఒక్కరు సామాజిక సేవకు సమయం కేటాయించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏవో సురేష్, ప్రొఫెసర్లు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ వనితా, సాయికృపరాజ్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసిన విష్ణు విద్యాసంస్థల ఛైర్మన్! - మెదక్ నర్సాపూర్
ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలని.. గమ్యాన్ని చేరేవరకు విరామం తీసుకోకూడదని విష్ణు విద్యాసంస్థల ఛైర్మన్ విష్ణురాజు అన్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఆయన ట్యాబ్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు సాంకేతికత సహాయంతో విద్యలో ముందుకెళ్లాలని సూచించారు.

పేద విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసిన విష్ణు విద్యాసంస్థల ఛైర్మన్!