విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో గురుకులాలా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ విలేజ్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురుకులాల్లో పనిచేసే అధ్యాపకులు వారి నివాస ప్రాంతాల్లో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
విలేజ్ లెర్నింగ్ సెంటర్లలో విద్యార్థులకు పాఠాలు - Village Learning Centers in medak district
కరోనా వ్యాప్తి వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు విలేజ్ లెర్నింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో 20 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గిరిజన బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు రాజు తెలిపారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో 20 విలేజ్ లెర్నింగ్ కేంద్రాలు నడుస్తున్నట్లు గిరిజన బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లురాజు తెలిపారు. రెడ్డిపల్లి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కరోనా సమయంలో పాఠశాలలు తెరచుకోకపోవడం వల్ల విద్యార్థులు దూరం కాకుండా రోజు రెండుగంటల పాటు వారికి పాఠాలు బోధిస్తున్నామని వెల్లడించారు.
నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ లెర్నింగ్ కేంద్రాలను అందరికి విద్యనందించాలనే ఉద్దేశంతో నడుపుతున్న ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు రాజు తెలిపారు. పాఠశాలలు పూర్తిస్థాయిలో నడిచే వరకు వీటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.