తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్దిచెబితే అట్రాసిటీ కేసు పెట్టడం సరికాదు' - Medak District Latest News

మెదక్ జిల్లా కలెక్టరేట్​ వద్ద రాయిన్​పల్లి ఘటన ముదిరాజ్ సంఘం బాధితులు ధర్నా చేశారు. కులం పేరుతో దూషించారని నెపంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయమన్నారు. విచారణ జరపి న్యాయం చేయాలని కోరారు.

SC, ST It is unfair to file an atrocity case
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయం

By

Published : Jan 28, 2021, 7:34 PM IST

మెదక్​లోని రాయిన్​పల్లిలో జరిగిన ఘటనపై పునర్​ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లును ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టి రాజు కోరారు. కులం పేరుతో దూషించారని చెప్పి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయమన్నారు. నియోజకవర్గ ఇంఛార్జీ జాల సాయిబాబా, బాధితులు కలెక్టరేట్​లో ధర్నా చేశారు.

అడిషనల్​ కలెక్టర్​కు పుట్టి రాజు వినతి పత్రం అందజేశారు. రాయిన్​పల్లికి చెందిన ముదిరాజ్ యువతికి నర్సాపూర్ వ్యక్తితో పెళ్లి జరిగిందని ఆయన తెలిపారు. వివాహం అయిన తరువాత అమ్మాయిని అబ్బాయి మానసికంగా వేధించాడనిపేర్కొన్నారు.

విషయం తెలిసి గ్రామానికి చెందిన కొంత మంది పెద్ద మనుషులు సదరు యువకుడిని, అతని తల్లిదండ్రులను పిలిచి నచ్చజెప్పారని చెప్పారు. అంతే కానీ.. అబ్బాయి కుటుంబ సభ్యులను ఎలాంటి దుర్బాషలాడలేదని పేర్కొన్నారు.

కులం పేరుతో దూషించారని యువతి తరపు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయమన్నారు. పోలీసులు ఘటన పూర్వా పరాలను పునర్​ విచారించి బాధితులకు న్యాయం చేయాలని పుట్టి రాజు, జల సాయిబాబా కోరారు.

ఇదీ చూడండి:'గంగపుత్రులకు మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలి'

ABOUT THE AUTHOR

...view details