మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలో గల రాయరావు చెరువులో రెండు లక్షల 70 వేల చేపపిల్లలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి విడుదల చేశారు. చెరువుల్లో చేపలు పెంచి అందరూ ఉపాధి పొందాలని ఎమ్మెల్యే కోరారు. కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వానలకు చెరువులో నీరు బాగా రావడం వల్ల ఈ ఏడాది మత్స్యకారులకు బాగా లాభాలు వచ్చే అవకాశముందన్నారు.
2.7 లక్షల చేపపిల్లల్ని విడుదల చేసిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి - చెరువులో చేపపిల్లల విడుదల వార్తలు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో రెండు లక్షల 70 వేల చేపపిల్లలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి విడుదల చేశారు. భారీ వానలకు చెరువుల్లోకి నీరు బాగా రావడం వల్ల ఈ ఏడాది మత్స్యకారులకు బాగా లాభాలు వచ్చే అవకాశముందన్నారు.
2.7 లక్షల చేపపిల్లల్ని విడుదల చేసిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
అనంతరం కౌడిపల్లి మండలం రాయిలాపూర్, ముట్రాజ్‌పల్లి గ్రామాల్లో చేపపిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. చేపపిల్లలు తొందరగా పెరగడానికి ఆహారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి చేపపిల్లలను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:డార్లింగ్ వచ్చేసింది.. స్వీటీ కాసేపట్లో వస్తుంది..