రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని టీఎస్‌యూటీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలోని నర్సాపూర్ మండలం మహ్మాదాబాద్ గ్రామంలోని కేజీబీవీలో మధ్యాహ్న సమయంలో ఉపాధ్యాయులతో కలసి పాఠశాల ముందు నిరసన తెలిపారు.
'కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి' - కేజీబీవీ తాజా సమాచారం
కేజీబీవీలలో పని చేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపధ్యాయులతో సమానంగా సౌకర్యాలు కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలోని మహ్మాదాబాద్ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
!['కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి' tsutf protest for give equal salarys for kgbv teachers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10320761-158-10320761-1611211183611.jpg)
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 కేజీబీవీలలో 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి తమ సంఘం తరఫున రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చి ఇతర సౌకర్యాలు కల్పించాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మారావు, ఉపాధ్యక్షుడు సుదర్శన్, కార్యదర్శి సౌమ్య, నాగుల్ మీరా, కేజీబీవీ ఉపాధ్యాయులు జబీనా, షమీమ్, విశాలక్షి, గీతా, మమత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నకిలీ విత్తనాలతో మోసపోయామని మొక్కజొన్న రైతుల ఆవేదన