రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని ధర్నాను విరమింపజేశారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజినల్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి హరీష్ రావు, మెదక్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పందించకపోవడం శోచనీయమన్నారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
మెదక్ డిపో కార్యాలయం ముందు కార్మికుల రాస్తారోకో - tsrtc strike in medak district
రోజురోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతమవుతోంది. మెదక్ జిల్లా ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
మెదక్ డిపో కార్యాలయం ముందు కార్మికుల రాస్తారోకో