రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజు కొనసాగుతోంది. మెదక్ జిల్లాకేంద్రంలో గుల్షన్ క్లబ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాందాస్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ముందు నుంచి పోరాటం చేసినా ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవట్లేదని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహించారు.
18వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె - tsrtc bus strike update
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.
18వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె