తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​లో చికిత్స పొందుతూ కండక్టర్ మృతి - మెదక్​లో చికిత్స పొందుతూ తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ మృతి

అనారోగ్యానికి గురైన మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్​పూర్​కు చెందిన ఆర్టీసీ కండక్టర్ షేక్ జాఫర్ చికిత్స పొందుతూ మరణించాడు.

మెదక్​లో చికిత్స పొందుతూ కండక్టర్ మృతి

By

Published : Nov 21, 2019, 11:21 AM IST

అనారోగ్యానికి గురైన ఆర్టీసీ కండక్టర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మెదక్​ జిల్లాలో జరిగింది. 2008 నుంచి మెదక్​ డిపోలో కండక్టర్​గా విధులు నిర్వహిస్తున్న కౌడిపల్లి మండలం సలాబత్​పూర్​కు చెందిన షేక్​ జాఫర్ ఈ నెల 13న ఇంట్లోనే తీవ్రఅస్వస్థతకు గురయ్యాడు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆర్థిక స్థితి బాగాలేకపోవడం.. సమ్మె వల్ల జాఫర్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని భార్య మజీరున్నీసా అన్నారు.

మెదక్​లో చికిత్స పొందుతూ కండక్టర్ మృతి

ఇదీ చదవండిః తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా..

ABOUT THE AUTHOR

...view details