రాష్ట్రంలో తెరాస పార్టీకి ఎదురులేదని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణంలో నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. అధికారంలోకి వచ్చాక చేపడుతోన్న సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల అందరికి అందుతున్నాయని తెలిపారు. మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు ప్రత్యేక పరిశీలకులు బాలుమల్లు, జిల్లాలో గతంలో కంటే ఎక్కువగా సభ్యత్వం నమోదు అయ్యిందన్నారు. ప్రజలలో తెరాసకు ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీయాదవ్, మాజీ మంత్రి సునీతారెడ్డి, నియోజకవర్గంలోని పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
"ప్రజలలో తెరాసకు ఆదరణ పెరుగుతోంది." ఎమ్మెల్యే మదన్‌రెడ్డి - సంక్షేమ పథకాలు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తెరాస కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. జిల్లాలో గతంలో కంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు.
ప్రజలలో తెరాసకు ఆదరణ పెరుగుతోంది.