తెలంగాణ

telangana

ETV Bharat / state

'అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది' - KALESHWARAM

మెదక్​లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి.. తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి సతీమణితో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జిల్లా నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు.

ప్రచారంలో పద్మాదేవేందర్​ రెడ్డి

By

Published : Apr 4, 2019, 6:22 PM IST

ప్రచారంలో పద్మాదేవేందర్​ రెడ్డి
తెరాస ఎంపీ అభ్యర్థికి మెదక్​ జిల్లా నుంచే అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి సతీమణి మంజులతో పట్టణంలో ప్రచారం చేశారు. సత్యసాయి బాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తారని హామీ ఇచ్చారు.

17 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రం మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందని పద్మా దేవేందర్​ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details