తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరోగ్యం-పోషణ'పై అధికారులకు శిక్షణ తరగతులు - training classes at medak

'ఆరోగ్యం- పోషణ'పై మెదక్​ వెలుగు సమాఖ్య భవనంలో ఏపీఎం, సీసీలు, వీఓలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయగా కలెక్టర్​ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

training classes at medak on health
'ఆరోగ్యం-పోషణ'పై అధికారులకు శిక్షణ తరగతులు

By

Published : Dec 18, 2019, 5:31 PM IST

మెదక్​ జిల్లా కేంద్రంలోని వెలుగు సమాఖ్య భవనంలో 'ఆరోగ్యం- పోషణ'పై ఏపీఎం, సీసీలు, వీఓలకు రెండు రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి హాజరయ్యారు.

ఆరోగ్యం- మహాభాగ్యం, ఆహారంలో ఆరోగ్యం, పోషకాలు నష్టపోకుండా వండే విధానం వంటి అంశాలపై రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. పేదలు మెరుగైన, ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

'ఆరోగ్యం-పోషణ'పై అధికారులకు శిక్షణ తరగతులు

ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details