వర్షపు నీరు నిలవడం వల్ల మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. చాలా సేపటి వరకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం - rain in medak district
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరడం వల్ల కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎన్హెచ్ఏఐ సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని ఎత్తి పోశారు.

మెదక్ జిల్లాలో వర్షంతో రాకపోకలకు అంతరాయం
రంగంలోకి దిగిన ఎన్హెచ్ఏఐ సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని ఎత్తి పోశారు. రహదారిపై వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు.