తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: నర్సాపూర్​ ఎమ్మెల్యే - నర్సాపూర్​ మండల పరిషత్​ కార్యాలయం

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి సూచించారు. నూతన ట్రాక్టర్లను నర్సాపూర్​ మండల పరిషత్​ కార్యాలయంలో పంపీణీ చేశారు.

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: నర్సాపూర్​ ఎమ్మెల్యే
గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: నర్సాపూర్​ ఎమ్మెల్యే

By

Published : Mar 11, 2020, 8:01 PM IST

Updated : Mar 12, 2020, 10:52 AM IST

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: నర్సాపూర్​ ఎమ్మెల్యే

అన్ని గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేస్తామని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నూతన ట్రాక్టర్లకు మదన్​ రెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. నూతనంగా మంజూరు చేసిన ట్రాక్టర్లను గ్రామస్తులు వాడుకోవాలని సూచించారు.

ప్రతి గ్రామం ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ట్రాక్టర్ల పంపీణీ కార్యక్రమం ఎంతో సంతోషకరమని ఆయన గుర్తు చేశారు . గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.

ఇవీ చదవండి :4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం

Last Updated : Mar 12, 2020, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details