డ్రైవర్ లేకుండానే రోడ్డుపై కొద్దిదూరం ట్రాక్టర్ పరుగులు తీసిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగింది. పట్టణానికి వివిధ పనుల కోసం వచ్చినవారు రహదారి పక్కనే ద్విచక్రవాహనాలు నిలిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ బండి స్టార్ట్ చేసి పక్కకు వెళ్లాడు.
డ్రైవర్ లేకుండానే రోడ్డుపై ట్రాక్టర్ పరుగులు.. వాహనాలు ధ్వంసం - తెలంగాణ వార్తలు
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ రోడ్డు మీదకు దూసుకొచ్చింది. వాహనాన్ని స్టార్ట్ చేసి డ్రైవర్ పక్కకు వెళ్లగా... ఆకస్మాత్తుగా ముందున్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.
డ్రైవర్ లేకుండానే రోడ్డుపై ట్రాక్టర్ పరుగులు, ట్రాక్టర్ హల్‌చల్
ఆకస్మాత్తుగా ట్రాక్టర్ ముందున్న బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కానీ కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇదీ చదవండి:lockdown effect on kids : కన్నవాళ్లను బూచోళ్లుగా చూస్తోన్న పిల్లలు