అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకుంటున్నారని టీపీసీసీ కార్యదర్శి మేడం బాలకృష్ణ ఆరోపించారు. పర్యవేక్షణ లోపించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని.. అదనపు కలెక్టర్ రమేశ్, తహసీల్దార్లకు సమస్యను ఫోన్లో వివరించారు. లారీలు పంపించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణ లోపం! - తెలంగాణ వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణ లోపిస్తోందని టీపీసీసీ కార్యదర్శి మేడం బాలకృష్ణ అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రారంభించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు, టీపీసీసీ
అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నీటి పాలవుతోందని అన్నారు. ఆరుగాలం పండించిన రైతులు తీవ్రంగా నష్టాల పాలయ్యారని ఆరోపించారు. ప్రతి గింజను కొంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Kishan Reddy : కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత్