తెలంగాణ

telangana

ETV Bharat / state

Devi Sri Prasad : కేటీఆర్ సార్.. మాట నిలబెట్టుకున్నాను.. - singer sharvani from medak district

మట్టిలో మాణిక్యం.. పల్లె పాటకు కేరాఫ్ అడ్రెస్.. శార్వాణికి తన టీవీ షోలో పాడే అవకాశమిచ్చినట్లు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​కు ట్వీట్ చేశారు. స్పందించిన కేటీఆర్.. సూపర్బ్ బ్రదర్ అంటూ రీట్వీట్ చేశారు.

మాట నిలబెట్టుకున్నాను కేటీఆర్ సార్
మాట నిలబెట్టుకున్నాను కేటీఆర్ సార్

By

Published : Jul 17, 2021, 10:13 AM IST

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ప్రశంసలు పొందిన మెదక్‌ జిల్లా నార్సింగికి చెందిన యువగాయని శార్వాణికి సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌(Devi Sri Prasad) తమిళ టీవీషోలో పాటపాడే అవకాశం ఇచ్చారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌ రాక్‌స్టార్‌ పేరిట నిర్వహించే పోటీల్లో శార్వాణి పాడింది.

పల్లె పాటకు పట్టం..

‘‘ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. పల్లెపాటకు పట్టం కట్టాను. మీరు గుర్తించిన లోకల్ టాలెంట్​ను.. చెన్నై వేదిక వరకు తీసుకెెళ్లాను. నేను నిర్వహిస్తున్న స్టార్ టూ రాక్​స్టార్ కార్యక్రమంలో అవకాశమిచ్చాను. నిజంగా ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్. నా షో పేరుకు తగ్గట్టుగానే ఆమె పాటలతో రాక్ చేసింది. ఆమె అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్పగా పాడింది. వచ్చే ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు జీ తమిళ్‌ ఛానల్‌లో ఈ షో వస్తుంది’’ దేవీశ్రీప్రసాద్‌ మంత్రిని ట్వీట్‌ చేస్తూ ఫొటోలను కూడా జత చేశారు.

సూపర్బ్ బ్రదర్..

‘గొప్ప చొరవ తీసుకున్నార’ని కేటీఆర్‌ దేవీశ్రీప్రసాద్‌(Devi Sri Prasad)ను అభినందిస్తూ రీట్వీట్‌ చేశారు. గత నెల 24న శార్వాణి గురించి ట్విటర్‌లో కేటీఆర్‌ తెలియజేశారు. ఆమె ప్రతిభావంతురాలైన గాయని అని పేర్కొన్నారు. దీనిపై దేవీశ్రీప్రసాద్‌ స్పందించి తాను ఆమెకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఆమెను చెన్నైకి రప్పించి పాట పాడించారు.

ABOUT THE AUTHOR

...view details