మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ చేపలు తీసుకువెళ్తున్న ఆటో... కొండాపూర్ అటవీ ప్రాంతంలో చెట్టును ఢీకొట్టింది. దీంతో చేపలను మరో ఆటోలోకి మార్చుతున్న క్రమంలో... వేగంగా వచ్చిన టిప్పర్ రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీహరి, నర్సింహులుగా గుర్తించారు. క్షతగాత్రులను హైదరాబాద్, నర్సాపూర్ ఆస్పత్రులకు తరలించారు.
రెండు ఆటోలను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మృతి - accident at medak
రెండు ఆటోలను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మృతి
07:10 May 17
రెండు ఆటోలను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మృతి
Last Updated : May 17, 2020, 9:54 AM IST