జిల్లాలో.. కొవిడ్ టీకా వేయించుకునేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారని మెదక్ కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. విస్తృత అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కలిపి.. మొత్తం 24 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పలు కేంద్రాలను సందర్శించి కార్యక్రమాన్ని పరిశీలించారు.
మెదక్ జిల్లాలో.. జోరుగా 'టీకా ఉత్సవ్'
అర్హులందరికీ టీకా అందించడమే లక్ష్యంగా చేపట్టిన 'టీకా ఉత్సవ్' కార్యక్రమం జోరుగా సాగుతోంది. మెదక్ జిల్లాలో.. టీకా తీసుకునేందుకు కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. కలెక్టర్ హరీశ్.. పలు కేంద్రాలను సందర్శించి కార్యక్రమాన్ని పరిశీలించారు.
టీకా ఉత్సవ్
14వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో.. వీలైనంత ఎక్కువ మందికి టీకా అందించడానికి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. అవకాశాన్ని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టీకాతో పాటు.. స్వీయ నియంత్రణ పాటిస్తూ, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇదీ చదవండి:మగువ.. చూపాలి తెగువ..!