సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వెనకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని అనేక సంక్షేమ పథాకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్... దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే విధంగా ప్రభువు ఆశీర్వాదించాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినట్లు పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సహకారంతో చర్చి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
మెదక్ చర్చిలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ ప్రార్థనలు - medak church
ప్రఖ్యాత మెదక్ సీఎస్ఐ చర్చిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రెండోసారి గెలిచిన తర్వాత కుటుంబసభ్యులతో చర్చిని సందర్శించారు. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధికి తనవంతు సాహకారం అందిస్తానని తెలిపారు
మెదక్ చర్చిలో ఎమ్మెల్యే కిషోర్