మెదక్ జిల్లాలో మూడేళ్ల బాబు బోరుబావిలో పడ్డాడు. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా వేసిన బోరు బావిలో సాయివర్ధన్ అనే బాబు ప్రమాదవశాత్తు పడ్డాడు. బోరు వేసిన అరగంటలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు
19:02 May 27
మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి
బోరు బావి వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్డీవో సాయిరాం, పాపన్నపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బోరు బావిలోకి ఆక్సిజన్ పంపే ఏర్పాట్లు చేస్తున్నామని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బోరు బావిలో 25 నుంచి 30 ఫీట్ల లోతులో బాలుడు ఉన్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.
బాబు పడిన వెంటనే బాలుడిని తీసే క్రమంలో బోరులో మట్టి పడింది. బోరు బావికి సమాంతరంగా ప్రొక్లేయిన్లతో తవ్వకం పనులు చేపట్టాం. ఘటనాస్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వస్తున్నాయి. బోరు తవ్వకం సమయంలో కుటుంబసభ్యులు అక్కడే ఉన్నారు.
-ధర్మారెడ్డి, మెదక్ కలెక్టర్
ఇదీ చూడండి:పారిశుద్ధ్య లోపం.. పొంచి ఉంది అనారోగ్యం