కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని రాష్ట్ర వైద్య పరిశీలకురాలు ఉష స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.
'వాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు' - ప్రాధాన్యత క్రమంలో అందరికీ టీకా
ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందజేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందని రాష్ట్ర వైద్య పరిశీలకురాలు ఉష పేర్కొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.
'వాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు'
వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితులను.. వైద్యాధికారి వెంకట్‌ను అడిగి తెలుసుకున్నారు ఉష. ప్రాధాన్యత క్రమంలో అందరికీ టీకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:క్షీణించిన శశికళ ఆరోగ్యం.. పరిస్థితి విషమం