తెలంగాణ

telangana

ETV Bharat / state

పురుగుల మందు దుకాణాల్లో తనిఖీలు - taskforce team inspections at fertilizer shops in Narsapur town.

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో ఫర్టిలైజర్ షాపులలో టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు చేస్తున్న డీలర్లకు నోటీసులు జారీ చేశారు.

The task force team conducted inspections at fertilizer shops in Narsapur town.
ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు: నోటిసులు జారీ

By

Published : Jan 2, 2021, 8:03 PM IST

నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న ఫర్టిలైజర్ డీలర్లకు టాస్క్ ఫోర్స్ టీం నోటీసులు జారీ చేసింది. హైద్రాబాద్ వ్యవసాయ కమిషనర్​ కార్యాలయ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీం నర్సాపూర్ పట్టణంలో నాలుగు షాపులను తనిఖీ చేసింది.

నోటీసులు జారీ..

డీలర్ల వద్ద రూ.14లక్షల విలువలతో కూడిన పురుగు మందుల కొనుగోలుకు సంబంధించిన సరైన బిల్లులు లేకపోవటంతో.. సరైన పత్రాలు సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీస్ కాల పరిమితి 21 రోజులు ఉంటుందని ఆలోపు వారు సరైన పత్రాలను సమర్పించవలసి ఉంటుందని నర్సాపూర్ వ్యవసాయశాఖ కార్యాలయం ఏవో వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం

ABOUT THE AUTHOR

...view details