తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - medak updates

మెదక్ పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్ ఛైర్మన్ పాలాభిషేకం చేశారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

The Municipal Chairman was anointed to paint CM KCR in Medak town
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : Jan 23, 2021, 6:14 PM IST

సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించారని మెదక్ మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఊరటనిస్తోంది..

అగ్రవర్ణాలలో లక్షలాది మంది నిరుపేదలు ప్రతిభ ఉన్నా బయటకు రాని పరిస్థితిలో ఉన్నారని తెలిపిన ఛైర్మన్.. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఊరటనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ.. పోస్ట్ తొలగించిన నటి

ABOUT THE AUTHOR

...view details