మెదక్ జిల్లా శంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామశివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి గమనించి క్షతగాత్రులను ఆంబులెన్స్‌లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి ఔదార్యాన్ని చాటుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఎమ్మెల్యే సూచించారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్యే - మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఔదార్యం
సేవాభావం కలిగిన ప్రజాప్రతినిధులు ఆపద సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామ శివారులో ఓ ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి క్షతగాత్రులను ఆంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్యే
మెదక్ నుంచి చేగుంట వెళ్లే రహదారిలో ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొన్న ఘటనలో కాజిపల్లికి చెందిన లాలూ, అతని కుటుంబసభ్యులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.