తెలంగాణ

telangana

ETV Bharat / state

సమాజంలో టీచర్లది కీలక పాత్ర : మండల వైద్యాధికారి

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మండల విద్యాధికారి కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. దేశ తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సమాజంలో టీచర్లది కీలక పాత్ర : మండల వైద్యాధికారి
సమాజంలో టీచర్లది కీలక పాత్ర : మండల వైద్యాధికారి

By

Published : Sep 5, 2020, 4:34 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మండల విద్యాధికారి కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సమాజంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని మండల వైద్యాధికారి బుచ్చా నాయక్ కొనియాడారు.

సామాాజిక సేవ అలవడేలాగా...

విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక సేవలు అబ్బే విధంగా బోధనలు అందించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు, సీఆర్పీలు మండల వైద్యాధికారి బుచ్చా నాయక్​కు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రవీణ, భీంలా, రూప, సుధాకర్, భైరవరెడ్డి, మొగులయ్య, నర్సింహా చారి, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా 20న చలో దిల్లీ

ABOUT THE AUTHOR

...view details