మెదక్ జిల్లా తూప్రాన్ సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. కార్యాలయంలో అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.
మెదక్ జిల్లా అచ్చంపేటలో భూముల వ్యవహారంపై కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విచారణలో అసైన్డ్ భూమి ఉన్నట్లు తేలిందని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తైన తర్వాత నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. సీఎస్ ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం అనిశా విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. డిజిటల్ సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు. విజిలెన్స్ విభాగం వివరాలను కలెక్టర్ పరిశీలించారు.
రైతుల ఫిర్యాదుతో దర్యాప్తునకు ఆదేశం
ఈటల అసైన్డ్ భూములు కబ్జా చేశారని నిన్న సీఎంకు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణకు కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో అచ్చంపేటలో భూములను అనిశా అధికారులు సర్వే చేశారు. ఫిర్యాదు చేసిన రైతులను ఒక్కొక్కరిగా పిలిచి వివరాలు సేకరించారు.
సంబంధిత కథనం :మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లో అధికారుల డిజిటల్ సర్వే
మరోవైపు మంత్రి ఈటలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అనుచరులు మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అచ్చంపేట భూముల వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు చేశారని... మండిపడ్డారు. ఈటలకు అనుకూలంగా నినాదాలు చేశారు.
సంబంధిత కథనం:రోడ్డుపై బైఠాయించి ఈటల అనుచరుల నిరసన
ఇదీ చూడండి :మంత్రి ఈటల రాజేందర్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు