'కరోనా కట్టడిలో ప్రభుత్వ చర్యలు భేష్' - Distribution of Subhash Reddy Masks in Medak District
కరోనా మహమ్మారిని నివారించాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం కుచన్‌పల్లి గ్రామంలో తయారు చేయించిన మాస్క్‌లను, శానిటైజర్లను పంపిణీ చేశారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నియమాలను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్సీ సుభాశ్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర సమయంలో బయటకు వస్తే తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. కొత్త కేసులు నమోదు కూడా బాగా తగ్గిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.