మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షం కారణంగా వరి ధాన్యం నేలపాలైయ్యింది. వడగండ్ల వర్షం కారణంగా చేతికొచ్చిన పంట పోయి తీవ్ర నష్టానికి గురైనట్లు రైతులు వాపోతున్నారు. దీనిపై సర్వే చేసిన వ్యవసాయశాఖ అధికారులు పూర్తి స్థాయి నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.
అకాల వర్షం.. తీరని పంట నష్టం - అకాల వర్షం
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కురిసిన అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సర్వే జరిపిన వ్యవసాయ శాఖ అధికారులు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అకాల వర్షం.. తీరని పంట నష్టం