తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్​లో స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన కలెక్టర్​ - పురపాలిక ఎన్నికల లెక్కింపు

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రతను కలెక్టర్​ ధర్మారెడ్డి పరిశీలించారు. మొత్తం 15 వార్డులు ఉండగా రౌండుకు 5 వార్డుల చొప్పున లెక్కించనున్నారు.

The collector who examined the rooms in Narsapur
నర్సాపూర్​లో స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన కలెక్టర్​

By

Published : Jan 23, 2020, 9:45 PM IST

పురపాలిక ఎన్నికల లెక్కింపు సమయంలో ఇబ్బందులు కలగకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రత పరిశీలించారు.

ఇక్కడ మొత్తం 15 వార్డులు ఉండగా రౌండుకు 5 వార్డులను చొప్పున లెక్కించనున్నట్లు వెల్లడించారు. లెక్కించాల్సిన వార్డును ముదుగానే ప్రకటిస్తూ.. అభ్యర్థులను మాత్రమే లోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమణమూర్తికి సూచించారు.

నర్సాపూర్​లో స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన కలెక్టర్​

ఇవీ చూడండి: టెండర్ ఎఫెక్ట్: ఆ స్థానాల్లో రేపే రీపోలింగ్

ABOUT THE AUTHOR

...view details