తెలంగాణ

telangana

ETV Bharat / state

వడగండ్ల వల్ల నష్టపోయిన పంటల పరిశీలన - వడగండ్ల వల్ల నష్టపోయిన రైతులను పరిశీలించిన కలెక్టర్​

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే మదన్​రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యటించారు. వడగండ్ల ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు.

collector dharma reddy examined the crops damaged
వడగండ్ల వల్ల నష్టపోయిన పంటల పరిశీలన

By

Published : Apr 22, 2020, 4:57 AM IST

వడగండ్ల ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మెదక్​ జిల్లా నర్సాపూర్​ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే మదన్​రెడ్డి, జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారు.

వడగండ్ల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. పాడైపోయిన పంట వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతా రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details