తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​ చర్చిలో ఘనంగా కోతకాలపు పండుగ ఆరాధనలు

మెదక్ సీఎస్​ఐ చర్చిలో కోతకాలపు పండుగ ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తమ ప్రభువైన ఏసుక్రీస్తుకు కృతజ్ఞతగా ఏడాదిలో వచ్చే మొదటి పంటలోని కొంతభాగాన్ని సమర్పిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

Thanksgiving Worships in medak church
మెదక్​ చర్చిలో ఘనంగా కోతకాలపు పండుగ ఆరాధనలు

By

Published : Nov 8, 2020, 7:11 PM IST

సుప్రసిద్ధమైన మెదక్‌‌ కాథడ్రల్‌‌ చర్చిలో ఆదివారం కోత కాలపు పంటల కృతజ్ఞతారాధన పండుగ వైభవంగా జరిగింది. తమ జీవనం కోసం పంటోత్పత్తులను ప్రసాదించినందుకు కృతజ్ఞతగా క్రైస్తవులు తమ ఆరాధ్యదైవమైన ఏసుక్రీస్తుకు మొదటి పంటను సమర్పించి ఆరాధించడం ఆనవాయితీ.

ఈసందర్భంగా తమ పొలాల్లో పండిన వరికంకులు, కూరగాయలు, పండ్లు, పువ్వులు తీసుకువచ్చి వాటితో చర్చిలోని ప్రధాన వేదిక, ప్రార్థన మందిరం, ద్వారాలను అలంకరించారు. మెదక్‌‌ చుట్టుపక్కల ప్రాంతాలు, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కోతకాలపు పంటల ఆరాధన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మత గురువులు శాంతి రాబర్ట్, రాజశేఖర్, దయనందు భక్తులకు దైవసందేశం అందజేశారు.

ఇదీ చూడండి:మెదక్​ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

ABOUT THE AUTHOR

...view details