రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలం శమ్నాపూర్ కొనుగోలు కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కేంద్రాల్లో ఎదురవుతోన్న సమస్యలను రైతులనడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రంలో మంత్రి హరీశ్ ఆకస్మిక తనిఖీలు - మెదక్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు
మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి శమ్నాపూర్ కొనుగోలు కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కేంద్రాల్లో ఎదురవుతోన్న సమస్యలను రైతులనడిగి తెలుసుకున్నారు.
grain purchasing centers
కేంద్రాల్లో సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి రైతులకు సూచించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఒంటరిగా ఉంచండి.. ఒంటరి వాళ్లని చేయకండి'