మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కాళేశ్వరం ప్రారంభం పురస్కరించుకుని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కాళేశ్వరం నీటితో ఇక్కడి ప్రాంత భూములన్ని సస్యశ్యామలం అవుతాయని మదన్ రెడ్డి తెలిపారు. రైతులు భూములను అమ్ముకోవద్దని కోరారు. రైతు ఉంటేనే దేశం అభివృద్ది చెందుతుందని స్పష్టం చేశారు.
"కాళేశ్వరం నీటితో భూములన్ని సస్యశ్యామలం" - tg_adb_91_22_eedurugaalula_bibhatsam_avb_c9
కాళేశ్వరం ప్రారంభం పురస్కరించుకుని.. నర్సాపూర్‌లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
"కాళేశ్వరం నీటితో భూములన్ని సస్యశ్యామలం"