తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇళ్ల వద్దే ఉంటూ పాఠ్యపుస్తకాలను సద్వినియోగం చేసుకోండి'

మెదక్​ జిల్లా చేగుంట మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆయా గ్రామాల సర్పంచ్​లు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. పుస్తకాలను సద్వినియోగం చేసుకుని ఇళ్లవద్దే ఉంటూ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.​

text books distribution to the govt school students at chegunta in medak district
'ఇళ్ల వద్దే పాఠ్యపుస్తకాలను సద్వినియోగం చేసుకోండి'

By

Published : Jul 30, 2020, 7:25 PM IST

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేట ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కరీంనగర్​ గ్రామ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సర్పంచ్ భాస్కర్ పుస్తకాలు అందజేశారు.

పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్​లతో పాటు కరీంనగర్ గ్రామ సర్పంచ్ రఘుపతి, చందాయి పేట ప్రాథమిక పాఠశాల, కరీంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇదీ చదవడి:సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details