తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ముందు భాజపా నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతం పాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జీ సింగాయపల్లి గోపి, కౌన్సిలర్లు సురేశ్, రాజేందర్, నాయకులు బాల్‌రెడ్డి, రఘవీరారెడ్డి, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయ ఆవరణలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు - etv bharath
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఆర్డీవో కార్యాలయం ముందు భాజపా నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ వద్ద జెండా ఎగరవేయడానికి వెళ్లిన భాజపా నాయకులను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఆర్డీవో కార్యాలయం ముందు జెండా ఎగరేసిన భాజపా
శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ వద్ద భాజపా నాయకులు జాతీయ జెండాను ఎగురవేయడానికి వెళ్లగా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు.
ఇదీ చదవండి:1948లో నిజాం రాజ్యం కుప్పకూలిన క్షణమిదే!