Telangana Election Result in Combined Medak : తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని వివిధ ప్రాంతల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఫలితాలు ఊహించిన విధంగానే వచ్చాయి. బీఆర్ఎస్ (BRS) అధికారాన్ని కోల్పోయింది. హస్తం అధికారాన్ని చేజిక్కించకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో తక్కువ స్థానాల్లో విజయం సాధించినా, ఇక్కడ రాజకీయం రోజురోజుకు ఉత్కంఠ రేకెత్తించింది. ప్రధానంగా ఇక్కడ గజ్వేల్ నుంచి కేసీఆర్, ఆయన పై పోటీగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ (Eetela Rajendar) పోటీలో నిలిచారు. అదేవిధంగా సిద్దిపేట నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మెజార్టీల్లో పోటీపడే హరీశ్‌రావు అక్కడ ఆసక్తిని నింపుతారు. కానీ ఈసారి మెజార్టీ విషయంలో గత ఎన్నికల కంటే తక్కువగానే వచ్చింది. గతంలో హరీశ్‌రావుగు లక్ష పై చిలుకు మెజారీటీ వస్తే ఈ ఎన్నికల్లో 83వేలతోనే సరిపెట్టుకున్నారు.
బీఆర్ఎస్ ఓటమిపై కన్నీటి పర్యంతమైన అభ్యర్థులు
BRS Won MLA Candidates : గతంలో కేసీఆర్ (KCR) 60వేల పై చిలుకు మెజారిటీ సాధిస్తే ఈ సారి మాత్రం 45వేల మెజార్టీతో సరిపెట్టుకున్నారు. దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ 53వేల మెజార్టీతో రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఎన్నికల్లో కారు మెజార్టీతో జోరు కంటే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడినా ప్రయోజనంలేకపోయింది. ఇక్కడబీజేపీ కచ్చితంగా గెలుస్తోందన్న నమ్మకం ఆ పార్టీ అధిష్ఠానంలో ఉంది. కానీ ఆ అంచనాలు తారుమారైనాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క స్థానంలో కూడా బీజేపీ ఖాతా తెరవలేదు.
రాజ్‌భవన్‌లో నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్
సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కె. మాణిక్ రావ్ 13వేల310 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. అందోలు కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ 27వేల 427 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌పై గెలుపొందారు. నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి 5వేల 766 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ సంగారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ (Congress) అభ్యర్థి జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ 9వేల 297 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.