తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలి: ఉపాధ్యాయ సంఘాలు - ordinance on the deduction of salaries of employees

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోతపై ఇచ్చిన ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలని కోరుతూ... ఉపాధ్యాయ సంఘాల నాయకులు నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

teachers union demanded immediate repeal the ordinance on the deduction of salaries of employees

By

Published : Jun 18, 2020, 8:34 PM IST

జూన్ నెల నుంచి పూర్తి జీతాలు ఇవ్వాలని కోరుతూ... మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు. వేతనాల కోతపై ఇచ్చిన ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

గత నాలుగు నెలలుగా కోతలతో వేతనాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ ముగిసినా కూడా పూర్తి వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జూన్‌ మాసం పూర్తి వేతనంతోపాటు పాత బకాయిలను విడుదల చేయాలని కోరారు. అరకోర జీతాలతో ఉద్యోగులు, పింఛనుదారులు ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పూర్తి వేతనం ఇచ్చేల చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీవో అరుణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి:డ్రాగన్​పై రామబాణం- చైనాకు వ్యతిరేకంగా ట్వీట్ల వర్షం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details