తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కల్పించడం లేదని... పీఆర్టీయూ మెదక్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. తమ సమస్యల పరిష్కారంపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. దానికి నిరసనగా జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
'సమస్యల పరిష్కారంపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' - మెదక్ జిల్లా తాజా వార్తలు
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... పీఆర్టీయూ తెలంగాణ శాఖ మెదక్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. దానికి నిరసనగా జిల్లా కేంద్రంలోని స్థానిక జీకేఆర్ గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
!['సమస్యల పరిష్కారంపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' teachers rally to the Collectorate under the auspices of PRTU in medak district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10557529-410-10557529-1612865606856.jpg)
సమస్యల పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పదోన్నతులు, బదిలీలు కల్పించాలని అన్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 45శాతం ప్రకటించి, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే విడుదల చేసి నిర్వహించాలని కోరారు.
ఇదీ చదవండి: 'చేతులు ఎత్తడం ద్వారానే మేయర్ ఎన్నిక'