ETV Bharat / state
'కాంగ్రెస్‌లో నాయకత్వ లోపంతోనే పార్టీని వీడాను' - TRS
'ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు అంచనా వేసుకొని, కార్యకర్తలు, అభిమానులతో చర్చించాకే కాంగ్రెస్‌ను వీడి తెరాస తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాను': సునీతా లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి


'కాంగ్రెస్‌లో నాయకత్వ లోపంతోనే పార్టీని వీడాను'
By
Published : Mar 28, 2019, 6:10 AM IST
| Updated : Mar 28, 2019, 9:40 AM IST
'కాంగ్రెస్‌లో నాయకత్వ లోపంతోనే పార్టీని వీడాను' కాంగ్రెస్‌లో నాయకత్వ లోపంతోనే పార్టీని వీడినట్లు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ విషయాలను వివరిస్తూ ఆ పార్టీ అధిష్ఠానానికి రాజీనామా పత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వీకరించినట్లు వివరించారు. ఇప్పుడు పీసీసీ క్రమశిక్షణ సంఘం తనని సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాజా రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకొని, కార్యకర్తలు, అభిమానులతో చర్చించాకే కాంగ్రెస్‌ను వీడి తెరాస తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాతే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసానని స్పష్టం చేశారు. Last Updated : Mar 28, 2019, 9:40 AM IST