మెదక్ జిల్లా పోచారం అభయారణ్యం పరిధిలో పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అడవిలో మూషిక జింకలను వదిలిపెట్టారు. పర్యావరణ సమతుల్యం సాధించడానికి.... అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా తెలంగాణను మలుచుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు హరీశ్‌రావు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
'పర్యావరణహిత రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నాం' - మెదక్‌లో పర్యావరణ విజ్ఞాన కేంద్రం ప్రారంభం
పర్యావరణహిత రాష్ట్ర నిర్మాణం కోసం అందరి సహకారం అవసరమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్ జిల్లా పోచారం అభయారణ్యం పరిధిలో పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు.
'పర్యావరణహిత రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నాం'
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా హరితహారం ఆరు విడతల్లో సుమారు 210 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. చెట్లను రక్షించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని... అప్పుడే స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని హరీశ్‌రావు అన్నారు.
ఇదీ చూడండి:వనయాత్రకు చలో... నగరాలకు చేరువలో కొత్త ఉద్యానవనాలు