మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక విద్యలో రాణిస్తూ ముందుకు సాగుతున్నారు. అక్కడ 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉంది. అన్ని తరగతుల పిల్లలకు ట్యాబ్ ల్యాబ్ పేరుతో 30 ట్యాబ్‌లను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది. విద్యార్థులందరికీ రోజూ ప్రత్యేక తరగతులు ఉంటాయి. తరగతిని బట్టి ప్రత్యేకంగా యాప్స్ ఉన్నాయి. ఇక్కడ సందేహాలు వచ్చిన వారికి ప్రొజెక్టర్‌తో ఈ లెర్నింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. పిల్లలు బొమ్మలు వేయడం, ఆంగ్ల పదాలు పద్యాలు నేర్చుకోవడం లాంటివి చేస్తున్నారు.
సర్కారీ బడిలో సాంకేతిక విద్య - మహమ్మదాబాద్ ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ట్యాబ్ ల్యాబ్
విద్యార్థులకు చదువుతోపాటు సాంకేతిక విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్ ల్యాబ్ పథకానికి రూపకల్పన చేసింది. మెదక్‌లో విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ట్యాబ్ ల్యాబ్‌తో విద్యార్థులకు ప్రత్యేక బోధన
TAGGED:
TAB LAB PROGRAM AT MEDAK